Saturday, August 1, 2015

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో!

నేస్తమా, 
గుప్పెడు గుండెలొ చప్పుడువై 

నా ప్రతి అడుగులకు తోడు నువై 

తప్పటి అడుగులు పడనీక 

నను వెన్నంటి నా నీడై నిలచి 

మౌనంగా నే నిలుచుంటె 

 ఆ అంతరంగాన్ని గమనించి

కన్నుల భాషేదో తెలిసినట్టు

 కన్నీరు రాక మునుపు ఓదారుస్తావు

 హృదయం గాయపడితే 

 నా గమనం మందగిస్తే

 చినుకై భాదలొస్తే 

గొడుగై అడ్డుపడతావు

    వూరికే వద్దు కన్నీరంటూ

  దాని విలువను చెబుతావు 

కష్టమైనా కన్నీరైనా

  కడదాకా తోడునీవే

 రక్త భంధం కాదు ఇది

 ఆ భంధం మించిన సంభందమిది

  కల్మషం ఎరుగని నీ మనసు

కడదాకా తోడు నిలువాలని

 ఆశిస్తూ 


స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో  

నీ ప్రియ నేస్తం, మురళీ / నాని / డిటియస్ / డార్లింగ్